లిఫ్ట్‌ బటన్ నొక్కిన అందరికీ పాజిటివ్‌

Coronavirus Spread Through Lift Button in Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : తెలంగాణ కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా  ఏమాత్రం నియంత్రణలోకి రావడంలేదు. ప్రాణాంతక పురుగు ఏ మూల నుంచి దాడి చేస్తోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొదట్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వ్యాప్తి చెందిన కరోనా రోజులు గడుస్తున్నా కొద్దీ జిల్లాలకు, పల్లెలకు పాకుతోంది. ఈ క్రమంలోనే ఖమ్మం పట్టణం సమీపంలో ఆపార్టమెంట్‌లో కరోనా కలకలం రేపింది. ఓ వ్యక్తి తెలియక చేసిన తప్పిదానికి ఓ అపార్ట్‌మెంట్‌లోని అందరికీ వైరస్‌ పాకింది. తొలుత లిఫ్ట్‌ బటన్‌ నొక్కిన వారంరికీ వచ్చిందని, ఈ తరువాత వారి ద్వారా అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్స్‌లో ఉన్న వారందరికీ వైరస్‌ పాకినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. (క్వారంటైన్ నిబంధనలు: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top