తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు

Ex Minister Gutta Mohan Reddy Threatens With Gun At Nalgonda District - Sakshi

చిట్యాల: కాలువ విస్తరణ పనులు చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌ను రాష్ట్ర మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో బెదిరించిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పెద్దకాపర్తి చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు తమ పొలం మీదుగా జరుగుతున్నాయని తెలుసుకున్న మాజీ మంత్రి అక్కడికి వచ్చి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన కాల్వ పనులు చేస్తున్న వారిని తన తుపాకీతో బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు విచారణ చేపట్టారు. 
(చదవండి: శ్రీవాణి హత్యకేసును ఛేదించిన పోలీసులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top