‘కొండపోచమ్మ’లో చేప పిల్లలు వదిలిన మంత్రులు

Fishes released in to Kondapochamma Reservoir - Sakshi

సాక్షి, సిద్దిపేట : మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు చేప పిల్లలు వదిలారు. వర్గల్ మండలం గౌరారంలో ఉచిత పశు కృత్రిమ గర్భధారణ శిబిరాన్ని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు ప్రారంభించారు. (వారికిచ్చిన భూములు రద్దు చేస్తాం : ​కేటీఆర్‌)

మానవులకు ఎంత విలువ ఉంటుందో జీవాలకు అంత విలువ ఉండాలని తలసాని అన్నారు. గోపాల మిత్రల సహకారం 3వేల నుండి 8వేల రూపాయలకు పెంచామని చెప్పారు. కరోనా కష్ట కాలంలో సైతం గోపాల మిత్రలకు జీతాలను అందించామని పేర్కొన్నారు. గొర్లకాపర్ల ఉపాధి పెరగడంతో, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతాంగానికి అనుసంధానంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. (సెప్టెంబ‌ర్‌ 1 నుంచి విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం)

కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం, చేపలు విడుదల చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఈ ఏడాది కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో 7.5 టీఎంసీల నీటిని నింపుతామని తెలిపారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో 14లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సమృద్ధిగా కురిసిన వర్షాలతో తెలంగాణ పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయన్నారు. ప్రతి చెరువు, చెక్ డ్యాం, రిజర్వాయర్‌లలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top