శ్రీరాం సాగర్‌: ఉట్టి పడుతున్న జల కళ

Heavy Rains: Inflow Increased To Sriramsagar Project - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున​ భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి శాతం 50 టీఎంసీలకు చేరుకుంది. అల్ప పీడనం ప్రభావంతో ప్రతీ ఏటా ఉండే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.  ఏటా సెప్టెంబర్నే‌లోనే వచ్చే వరదలతో ఎస్సారెస్పీ నిండేది. కానీ ఈ సారి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుండటతంతో ఇన్ ఫ్లో 65 నుంచి 70 వేల క్యూసెక్కుల మేర వస్తోంది. ఈ నీటిలో  మిషన్ భగీరథ అవసరాల కోసం 776 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. (వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష)

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు అంటే 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1079.20 అడుగులు 50.238 టీఎంసీ లుగా ఉంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో జిల్లాలోని త్రివేణి సంగమం కందకుర్తి వద్ద గోదావరి ఉదృతి కొనసాగుతోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్దు గోదావరి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.. అక్కడ మంజీరా హరిద్రా నదులు గోదావరి మూడు నదులూ కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తాయి. మూడు నదుల కలయికతో కందకుర్తిలో జల కళ ఉట్టి పడుతోంది.. అక్కడ నది మధ్యలో ఉన్న ప్రాచీన శివాలయం క్రమంగా మునుగుతుంది.. మొత్తానికి ఈ ఏడు ఎస్సారెస్పీ కి ముందే ఆశించిన  స్థాయిలో వరదలు రావడంతో ఆరు జిల్లాల్లోని లక్షలాది రైతన్న ల్లో ఆనందం వెల్లవిరుస్తోంది. (కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top