హైదరాబాద్‌-యూఏఈకి మరిన్ని విమాన సర్వీసులు  

Hyderabad To UAE Flight Services Increased - Sakshi

సాక్షి, శంషాబాద్‌: భారత్‌–యూఏఈ మధ్య కుదిరిన ట్రాన్స్‌పోర్టబుల్‌ ఒప్పందం మేరకు ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు ప్రారంభించింది. వారంలో మూడు రోజులు కొనసాగుతున్న ఈ సర్వీసులకు తోడుగా తాజాగా ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా దుబాయ్‌కు సర్వీసులు ప్రారంభించింది. సోమ, బుధ, శనివారాల్లో ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇక హైదరాబాద్‌–షార్జాకు మధ్య ఎయిర్‌ అరేబియా ఎయిర్‌లైన్స్‌ వారంలో మూడు సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉంటాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. కరోనా నిబంధనల మేరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top