కరుణించిన కేసీఆర్

కేశ్వాపూర్ భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తామన్న సీఎం
శామీర్‌పేట్: కేశ్వాపూర్ రైతుల చిరకాల కల నెరవేరింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే కరుణించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల పరిధిలోని కేశ్వాపూర్ గ్రామ రైతులకు చెందిన సిరులు పండే వ్యవసాయ భూములను కేశ్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కోసం సేకరించారు. సరైన పరిహారం అందడం లేదనే బాధలో ఆ గ్రామ రైతులు ఉన్నారు.
ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిస్తే ఫలితం ఉంటుందని ఆలోచించారు. కేశ్వాపూర్ గ్రామసర్పంచ్ ఇస్తారి నాయకత్వంలో 50 మంది రైతులు శుక్రవారం ఎర్రవల్లిలోని సీఎం ఫాంహౌస్‌కు తరలివెళ్లారు. కేసీఆర్‌కు కలిసి బాధిత రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, కేశ్వాపూర్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. సేకరించిన వ్యవసాయ భూములకు ఒక్కో ఎకరాకు రూ. 37 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పరిహారాన్ని రైతులకు వెంటనే అందజేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు, మేడ్చల్‌జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి