‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’

MP Asaduddin Owaisi Consultation To AE Uzma Fatima Family - Sakshi

ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అసదుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం విద్యుత్ కేంద్రo ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. అజాంపురా హరిలాల్ బాగ్‌లోని ఫాతిమా కుటుంబాన్ని శనివారం ఆయన కలిశారు. ఫాతిమా ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె చిన్నప్పటి నుంచి ధైర్యశాలియని, చదువులో ముందుడేదని ఎంపీ గుర్తు చేసుకున్నారు.

ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇతరులను కాపాడే క్రమంలో ఫాతిమా అసువులు బాశారని అన్నారు. ఆమె కుటుంబానికి త్వరగా సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్‌ కోరారు. కాగా, శ్రీశైలం ఎడమ గుట్టు భూగర్భ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో​ ప్లాంట్‌లో 17 మంది విధుల్లో ఉండగా.. 8 మంది గాయాలతో బయటపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 
(చదవండి: మృత్యుసొరంగం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top