వరంగల్ ఎంజీఎంలో అధికారుల నిర్లక్ష్యం

Warangal MGM Hospital Management Neglect On Corona Deceased Body - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనాతో మృతి చెందిన మహిళకు సంబంధించిన సమాచారం బంధువులకు ఇవ్వకుండానే అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ తల్లి చనిపోయిందని తెలుసుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన కుటంబసభ్యులకు మృతదేహం లేదని అధికారులు చెప్పారు. అంతేకాకుండా మృతదేహానికి అంత్యక్రియలు ఎక్కడ చేశారో కూడా తెలియజేయలేదు. దీంతో బంధువులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హన్మకొండ గోపాలపూర్‌కు చెందిన మహిళ ఈ నెల13న ఎంజీఎం అస్పత్రిలో కరోనా చికిత్స పొందుతు మృతి చెందారు. (తెలంగాణలో 90వేలకు పైగా కరోనా కేసులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top