ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు పాజిటివ్‌

Yellareddy MLA Jajala Surender Tested Coronavirus Positive - Sakshi

సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఆయన హైదరాబద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సురేందర్‌ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకూ సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. కాగా,  ఇప్పటికే  ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్‌ బారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.  (తెలంగాణ కరోనా రికవరీ రేటు 77.31శాతం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top