అయ్యో ! ర‌ణ్‌వీర్ ఎంత ప‌ని జ‌రిగే..

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ ‌సింగ్ ఎంత  మంచి డ్యాన్సర‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌‌న‌వస‌రం లేదు. డ్యాన్స్ చేయ‌డంలో అతని టైమింగ్, స్టైల్ మిగ‌తా వారి క‌న్నా కాస్త డిఫ‌రెంట్‌గా  అనిపిస్తాయి. ఒక అవార్డ్సు ఫంక్ష‌న్ లో ర‌ణ్‌వీర్‌ సింగ్ రామ్ లీలా చిత్రంలోని న‌గ‌డా సాంగ్ డోల్ బాజేకు డ్యాన్స్ చేశాడు.ర‌ణ్‌వీర్ సూప‌ర్‌గా డ్యాన్స్ చేస్తూ షోలో ఉన్న‌వారిని అల‌రిస్తున్నాడు. ఇంత‌లో చిన్న‌ ‌అప‌శృతి చోటుచేసుకుంది. అప్ప‌టికే పాట కోసం స్టేజీపై పెద్ద డోల్స్ ఏర్పాటు చేశారు.

ర‌ణ్‌వీర్‌ పాట‌కు స్టెప్పులేస్తూ డోల్స్ వాయిస్తుండ‌‌గా..ఓ డోల్ పై ఉన్న క్లాత్ చిరిగిపోయింది. దీంతో ర‌ణ్‌వీర్‌ ఒక్క‌సారిగా అందులో పడిపోయాడు. అప్ప‌టివ‌ర‌కు పాట‌ను ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్ష‌కులంతా అనుకోని ఘట‌న జ‌రిగే సరికి షాక్ కు లోన‌య్యారు. వెంటనే స్టేజీపై ఉన్న డ్యాన్స‌ర్లు, స‌హాయ‌కులు ర‌ణ్ వీర్ ను డోల్ లోప‌లి నుంచి బ‌య‌ట‌కు తీశారు. ర‌ణ్ వీర్ కు ఊపిరి పీల్చుకున్నంత ప‌నైంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ర‌ణ్‌వీర్ నువ్వు మంచి డ్యాన్స‌ర్ అని  ఒప్పుకుంటాము.. కానీ ఓవ‌ర్ స్మార్ట్ త‌గ్గించుకుంటే మంచిది.. అయ్యో! పాపం ర‌ణ‌వీర్..‌ తొంద‌ర‌గా పైకి లేపండి.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top