‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
మృగరాజు సింహం విషయంలో తరచుగా ఓ మాట వింటుంటాం. ఆకలేసినంత మాత్రానా సింహం గడ్డి తినదని. కానీ ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఈ సింహం తాపీగా గడ్డి నముల్తుంది కాబట్టి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ వింత సంఘటన గిర్ అడవుల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుజరాత్లో గిర్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తింటూ వీడియోకు చిక్కింది. సింహం గడ్డిని నమిలి, బయటకు ఉమ్మేయడం వీడియోలో రికార్డయ్యింది. దాన్ని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది శాఖహార మృగరాజేమో’.. ‘ఈ సింహం భార్య డైటింగ్ చేయమన్నట్లుంది. అందుకే ఇలా గడ్డి తింటుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి