కాకినాడలో లారీ డ్రైవర్‌ దారుణ హత్య

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడ నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుడారిగుంటలో లారీ డ్రైవర్‌ బ్రహ్మానందం హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బ్రహ్మానందం ఇంట్లోకి చొరబడి కత్తులతో అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్‌లు ధరించిన దుండగులు బ్రహ్మానందం భార్య కళ్లముందే ఈ దారణానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకన్నారు. ఈ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. పరారైన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top