ఎమ్మెల్యే సీతక్క.. కబడ్డీ, కబడ్డీ..!
సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్‌టైన్‌మెంట్ డే’ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి