వైరల్‌: 2,3,4.. మగాళ్ల కోసం బంపర్‌ ఆఫర్‌!! 

కొత్తగా ఏదైనా షాపు కానీ, హోటల్‌ గానీ ఓపెన్‌ చేసినపుడు కస్టమర్లను ఆకర్షించటం కోసం ఆఫర్లు పెట్టటం పరిపాటి. వ్యాపారం ఏదైనా ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకర్షించటం అన్నది ప్రస్తుత మార్కెటింగ్‌ స్ట్రాటెజీ. అదే విధంగా పాకిస్తాన్‌లోని బహవాల్‌పుర్‌లో కొత్తగా తెరవనున్న ఓ ఫంక్షన్‌ హాలు కూడా తమ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రెండు, మూడు, నాలుగో సారి పెళ్లి చేసుకోవాలనుకునే మగవారికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్‌ ఇస్తామంటోంది. మగాళ్లను ఆకర్షించటానికి ఓ ప్రచార వీడియోను సైతం తయారు చేసి జోరుగా ముందుకు దూసుకుపోతోంది. ‘‘ దమ్ముంటే మైదానంలోకి దిగండి. ఇంకో పెళ్లి చేసుకుని చూపించండి. బహవాల్‌పుర్‌లో తెరవబోతున్న కొత్త ఫంక్షన్‌ హాల్‌ మీకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది’’ అంటూ వాయిస్‌ ఓవర్‌ కలిగిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేదో బాగుందనుకుంటే పొరపాటే! ఫంక్షన్‌ హాల్‌ కండీషన్లు చదివితే మన మతి పోతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top