వైర‌ల్‌: సిగ‌రెట్‌తో రాకెట్ల ప్ర‌యోగం

గాల్లో ఎగిరే రాకెట్ ప‌య‌నం నేల మీద నుంచే ప్రారంభ‌మ‌వుతుంది. అది ఇస్రోలోనైనా, ఇంటి ముందు వాకిట్లో అయినా! అయితే ఓ పెద్దాయ‌న మాత్రం రాకెట్‌ను పంపించేందుకు కొత్త విధానాన్ని క‌నుగొన్నాడు. కానీ దీన్ని ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌ద్ద‌ని కోరుతున్నాడు. అదేంట‌ని తిక‌మ‌క‌ప‌డ‌కుండా ముందుగా ఈ వార్త చ‌దివేయండి.. అట‌వీ అధికారి సుశాంత్ నందా ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఓ వ్య‌క్తి న‌డిరోడ్డుపై నిల‌బ‌డుతూ ఓ సాహ‌సానికి పూనుకున్నాడు. ద‌ర్జాగా సిగ‌రెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఓ చేతిలో రాకెట్ల‌తో నిల‌బ‌డ్డాడు.

ఇంకేముందీ.. ఎవ‌రూ ఆ దారి గుండా రావ‌డం లేద‌ని నిశ్చ‌యించుకున్నాక అస‌లు ప‌ని ప్రారంభించాడు. ఒక్కో రాకెట్‌ను కుడి చేతులోకి తీసుకుని దాని చివ‌ర‌ను నోట్లో ఉన్న సిగ‌రెట్‌కు అంటించి గాల్లోకి పంపాడు. ఏ మాత్రం తొణు‌కు బెణుకూ లేకుండా సునాయాసంగా రాకెట్ల‌ను అంత‌రిక్షంలోకి కాకపోయినా ఆకాశంలోకి పంపాడు. సుమారు ప‌ది రాకెట్ల‌ను కేవ‌లం ప‌ద్దెనిమిది సెకండ్ల‌లో గాల్లోకి పంపాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. "అదిరింద‌య్యా నీ ప్ర‌యోగం" అంటూ కొంద‌రు అదుర్స్ అని కామెంట్లు చేస్తుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం "కొంచెం తేడా వ‌చ్చినా ప్రాణాల‌కే ప్ర‌మాదం" అని మండిప‌డుతున్నారు. కాగా ఇది పాత వీడియో అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి వైర‌ల్ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top